IND Vs ENG: తడబడుతోన్న ఇంగ్లాండ్.. జామీ స్మిత్ మెరుపు సెంచరీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-04 15:25:09  IST  )

ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) వేదికగా ఇంగ్లాండ్‌తో జరగుతోన్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది.

IND Vs ENG: తడబడుతోన్న ఇంగ్లాండ్.. జామీ స్మిత్ మెరుపు సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది. 77 పరుగులు 3 వికెట్ల ఓవర్‌నైట్ స్కో్ర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు మరో రెండు వికెట్లను కోల్పో్యి 249 పరుగులు చేసింది. జో రూట్ 46 బంతుల్లో 22 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ కిపర్ రిషభ్ పంత్ క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. అదేవిధంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ సిరాజ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చి జామీ స్మిత్, హ్యరీ బ్రూక్‌తో కలిసి చక్కని షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తిస్తూ.. ఏకంగా శతకం బాదేశాడు. లంచ్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 5 కీలక వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 127 బంతుల్లో 91 పరుగులు, జామీ స్మిత్ 82 బంతుల్లో 102 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, అంతకు ముందు 310/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా (Team India) తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. శుభ్‌మన్ గిల్(387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లతో 269) రికార్డ్ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఇక రవీంద్ర జడేజా(137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 89), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. వాషింగ్టన్ సుందర్ (103 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(3/167) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/81), జోష్ టంగ్(2/119) రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్‌లకు చెరో వికెట్ దక్కింది.

Next Story