శతక వీరుడు సిరాజ్.. కీలక మైలురాయిని సాధించిన హైదరాబాదీ పేసర్

by Harish |

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకున్నాడు.

శతక వీరుడు సిరాజ్.. కీలక మైలురాయిని సాధించిన హైదరాబాదీ పేసర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు ఆడటం ద్వారా అతను 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. 2017లో ఇంటర్నేషనల్ కెరీర్ మొదలు పెట్టిన సిరాజ్ మూడు ఫార్మాట్లలో భారత జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 99 మ్యాచ్‌లు ఆడిన అతను 28.53 సగటుతో 198 వికెట్లు తీశాడు. భారత్ తరపున 39 టెస్టుల్లో 113 వికెట్లు, 44 వన్డేలలో 71 వికెట్లు, 16 టీ20 మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్-2023 గెలిచిన భారత జట్టులో సిరాజ్ సభ్యుడు. టెస్టుల్లో విదేశాల్లో సిరాజ్‌కు మంచి రికార్డు ఉంది. 2020లో టెస్టు అరంగేట్రం చేసిన తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లలో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 23 టెస్టుల్లో 88 వికెట్లు తీసిన సిరాజ్ విదేశాల్లో రెండో సక్సెస్‌ఫుల్ బౌలర్. అతని కంటే ముందు బుమ్రా ఉన్నాడు. అతను 20 టెస్టుల్లో 100 వికెట్లు తీశాడు. మాంచెస్టర్ టెస్టులో సిరాజ్ మరో రెండు వికెట్లు తీస్తే 200 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.


Next Story