IND Vs AUS: విజృంభించిన మిచెల్ స్టార్క్.. తక్కువ స్కోర్‌కే టీమిండియా అలౌట్

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-06 09:19:12  IST  )

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న పింక్ బాల్ డే అండ్ నైట్ (Day & Night) టెస్ట్‌లో తొలి రోజు టీమిండియా 180 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

IND Vs AUS: విజృంభించిన మిచెల్ స్టార్క్.. తక్కువ స్కోర్‌కే టీమిండియా అలౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న పింక్ బాల్ డే అండ్ నైట్ (Day & Night) టెస్ట్‌లో తొలి రోజు టీమిండియా 180 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అంతకు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohith Sharma) బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ తొలి బంతికే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal), పేసర్‌ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వేసిన బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం కాసేపు కుదురుగా ఆడిన కేఎల్ రాహుల్ (KL Rahul) (37), శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) (31) స్టార్క్, స్కాట్ బోలాండ్ (Scott Boland) బౌలింగ్‌లో పెవీలియన్ చేరారు.

ఇక క్రీజ్‌లోకి వచ్చిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ (Pat Cummins) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohith Sharma), స్కాట్ బోలాండ్ (Scott Boland) బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరిపోయాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన తెలుగబ్బాయి నితీష్‌రెడ్డి (Nithish Reddy) (42) పరుగులతో ఇన్సింగ్స్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) (22)తో కలిసి అతడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ మిచెల్ స్టార్క్‌ (Mitchell Starc) బౌలింగ్‌లో అవుటయ్యారు. ఇక ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు, ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్‌‌లు చెరో 2 వికెట్లను పడగొట్టారు. డే అండ్ నైట్ టెస్ట్ కావడంతో డిన్నర్ బ్రేక్ అనంతరం ఆసిస్ తొలి ఇన్సింగ్స్ మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది.

Next Story