- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sachin Tendulkar : క్రికెట్ ప్రియులకు పండగే పండగ.. గ్రౌండ్స్ లో మళ్ళీ అడుగుపెట్టనున్న క్రికెట్ దేవుళ్లు
భారత క్రికెట్(Cricket) అభిమానులకు పండగచేసుకునే వార్త ఇది.

దిశ, వెబ్ డెస్క్ : భారత క్రికెట్(Cricket) అభిమానులకు పండగచేసుకునే వార్త ఇది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)ని బ్యాటర్‌గానే కాదు కెప్టెన్‌గానూ చూసే అరుదైన అవకాశం వచ్చింది. క్రికెట్ ప్రియులకు.. ముఖ్యంగా 80లలో, 90లలో పుట్టిన వారికి ఇక తమ ఆరాధ్య క్రికెటర్ల ఆటను టీవీల్లో రిపీట్ ప్లేలు తప్ప లైవ్ లో చూడలేమనే బాధ అవసరం లేదు. తమ క్రికెట్ దేవుళ్ళు అంతా మళ్ళీ బ్యాట్, బాల్ తో గ్రౌండ్ లో దిగి పరుగుల వరద పారిస్తే, వికెట్ల విజృంభణ చేస్తే.. మైమరచి పోయి చూడవచ్చు ఇక. ఇక తమ పెద్దవాళ్ళు తమ ఫేవరెట్ క్రికెటర్ల గురించి చెబితే వినడమే తప్ప.. వాళ్ళు ఎలా ఆడతారో "జెన్ జీ"లకు తెలియదు. ఆ లెజెండరీల క్రికెట్ చూసే అవకాశం వారికి ఇప్పుడు రానుంది.
అదెలా అంటే.. తాజాగా ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(IML) తొలి సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కి సచిన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2025 ఫిబ్రవరి 22న భారత్- శ్రీలంక(Bharat-Srilanka) మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ఈ లీగ్గురించి సచిన్ టెండూల్కర్ తాజాగా మాట్లాడాడు. 'IML క్రికెట్ప్రత్యేకమైన, శాశ్వతమైన వారసత్వానికి సెలబ్రేషన్ లాంటిది. లీగ్‌లో నా సమకాలీనులతో కలిసి మైదానంలోకి అడుగు పెట్టడానికి ఎదురుచూస్తున్నాను. అన్ని జట్లూ గెలుపుకోసం కష్టపడతాయి. టోర్నీలో పోటీ తీవ్రంగా ఉంటుంది' అని సచిన్ తెలిపాడు.
కాగా, ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ వంటి టాప్ టీమ్‌లు తలపడబోతున్నాయి. ఆయా జట్లకు ఆల్‌టైమ్ లెజెండరీ క్రికెటర్లు కెప్టెన్‌లుగా వ్యవహరించనున్నారు. వెస్టిండీస్‌కి బ్రియాన్ లారా, శ్రీలంకకి కుమార సంగక్కర సారథ్యం వహిస్తున్నారు. ఆస్ట్రేలియాని షేన్ వాట్సన్, ఇంగ్లాండ్‌కి ఇయాన్ మోర్గాన్ నడిపించనుండగా, దక్షిణాఫ్రికాకు జాక్వెస్ కల్లిస్ కెప్టెన్సీ చేయనున్నాడు.






