ఖతార్ ఓపెన్‌ క్వార్టర్స్‌కు స్వియటెక్, రిబకీనా

by Phanindra |

ఖతార్ ఓపెన్‌ క్వార్టర్స్‌కు స్వియటెక్, రిబకీనా చేరుకున్నారు. ప్రీక్వార్టర్స్‌లో అద్భుతమైన పోరాటంతో ముందడుగేశారు.

ఖతార్ ఓపెన్‌ క్వార్టర్స్‌కు స్వియటెక్, రిబకీనా
X

దిశ, స్పోర్ట్స్: ఖతార్ ఓపెన్‌లో పోలిష్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియటెక్ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చింది. డరియా కసాత్కినాతో జరిగిన మ్యాచులో తొలి గేమ్ ఓడినా.. ఆ తర్వతా పుంజుకొని విజయం సాధించింది. రష్యాలో పుట్టిన ఆస్ట్రేలియా అమ్మాయి కసాత్కినా 5-7తో తొలి గేమ్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత రెచ్చిపోయిన స్వియటెక్ వరుసగా 6-1, 6-1 తేడాతో ఆమెను చిత్తు చేసి ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. గతంలో 2022, 2023, 2024లో ఖతాన్ ఓపెన్ విజేత ఇగానే కావడం గమనార్హం.

రిబకీనా కూడా..

ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గి జోరు మీదున్న ఎలీనా రిబకీనా కూడా ఖతాన్ ఓపెన్‌లో జోరు కొనసాగించింది. చైనాకు చెందిన ఝెంగ్ కిన్వెన్‌ చేతిలో తొలి గేమ్ కోల్పోయిన రిబకీనా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా 4-6, 6-2, 7-5 తేడాతో మ్యాచ్ నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

Next Story