- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెస్సీతో ఫొటో తీసుకునే ఛాన్స్.. ఇది చాలా కాస్ట్లీ గురూ..
ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెససీ ఈనెల 13న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంకు రానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెససీ ఈనెల 13న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంకు రానున్నారు. ఆ రోజు సాయంత్రం ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగే మెస్సితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయనతో ఫొటో తీసుకునే అవకాశం కల్పించారు నిర్వాహకులు. కానీ ఆ ఫొటో చాలా కాస్ట్లీగా ఉండనుంది. మెస్సీతో ఫొటో కావాలంటే.. స్పాట్లో అక్షరాలా పది లక్షల రూపాయలు పే చేయాల్సిందేనని ద గోట్ టూర్ తెలిపింది. ఈ అవకాశం కూడా 100 మందికి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ టికెట్లను డిస్ట్రిక్ట్ యాప్ ల అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఒక్కో ఫొటోకు రూ.9.95 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి జీఎస్టీ ఎక్స్ ట్రా. కాగా.. శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్ కు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి వస్తారు. ఆయనతో పాటు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా స్టేడియంలో సందడి చేస్తారు.






