గెలిస్తేనే చాంపియన్‌గా చూస్తారు : గంగూలీ

by Dishanational3 |
గెలిస్తేనే చాంపియన్‌గా చూస్తారు : గంగూలీ
X

దిశ, స్పో్ర్ట్స్ : క్రీడల్లో పాల్గొంటే చాంపియన్‌ అవ్వరని, గెలిస్తేనే చాంపియన్‌గా పరిగణిస్తారని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన ‘సౌరవ్ కాలింగ్ సౌరవ్’ కార్యక్రమంలో భారత స్టార్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోషల్‌తో గంగూలీ మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘మీరు నాయకత్వం వహించిన జట్టులో మంచి స్క్వాష్ ప్లేయర్ ఎవరు?’ అని గంగూలీని ఘోషల్ అడిగాడు. సచిన్ టెండూల్కర్ అని దాదా బదులిచ్చాడు. అతని బాల్ సెన్స్ కారణంగా రాకెట్ క్రీడల్లో రాణించేవాడని, సచిన్ టేబుల్ టెన్నిస్ కూడా బాగా ఆడతాడని చెప్పాడు. ఏ క్రికెటర్‌లో సారూప్య లక్షణాలు ఉన్నాయని గంగూలీ అడగ్గా.. రాహుల్ ద్రవిడ్ అని ఘోషల్ తెలిపాడు. ‘బయట నుంచి చూస్తే ద్రవిడ్ పద్ధతిగా కనిపిస్తాడు. అది నాలోనూ ఉంటుంది.’ అని చెప్పాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గంగూలీ తొలి మ్యాచ్ తర్వాత నాలుగేళ్లపాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. 1996లో తిరిగి ఇంగ్లాండ్‌పై ఆడాడు. 1992-96 మధ్య కాలంలో ఆలోచన విధానాన్ని వివరించాలని గంగూలీని ఘోషల్ కోరగా.. క్రీడా స్ఫూర్తి, క్రీడాకారులు ఒత్తిడిని అధిగమించాల్సిన అవసరాన్ని దాదా వివరించాడు. ‘క్రీడలు అంటే పాల్గొనడం అనేది ఎప్పటికీ కాదు. మిమ్మల్ని చాంపియన్‌గా చూడాలంటే మీరు విజయం సాధించాలి.’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed