U19 ఆసియా కప్ సెమీ ఫైనల్ రద్దయితే.. భారత్ ఫైనల్ కే!

by Muthe.Rajitha |

అండర్‌-19 ఆసియా కప్‌లో ఈరోజు జరగాల్సిన రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యే అవకాశముంది.

U19 ఆసియా కప్ సెమీ ఫైనల్ రద్దయితే.. భారత్ ఫైనల్ కే!
X

దిశ, వెబ్ డెస్క్ : అండర్‌-19 ఆసియా కప్‌లో ఈరోజు జరగాల్సిన రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యే అవకాశముంది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీవేదికగా భారత్‌, శ్రీలంక మధ్య జరగాల్సిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా ఇంకా టాస్‌ కూడా పడలేదు. వర్షం తగ్గినప్పటికీ ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో ఆట మొదలు కాలేదు. ఇక ది సెవన్స్‌ స్టేడియంలో జరగాల్సిన బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ సెమీఫైనల్‌ మ్యాచ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంద. సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌ డే లేకపోవడంతో ఈ మ్యాచ్‌లు రద్దయితే, పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న గ్రూప్‌-ఏ భారత్‌, గ్రూప్‌-బీ బంగ్లాదేశ్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్‌ మ్యాచ్‌ డిసెంబర్‌ 21న ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో జరగనుంది.

Next Story