జడేజాను అవహేళన చేసిన స్టోక్స్.. ఫైర్ అయిన అశ్విన్

by Harish |

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై భారత మాజీ క్రికెటర్ అశ్విన్ ఫైర్ అయ్యాడు.

జడేజాను అవహేళన చేసిన స్టోక్స్.. ఫైర్ అయిన అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : నాలుగో టెస్టులో చివరి రోజు సుందర్, జడేజా సెంచరీలను అడ్డుకోవాలనే దురుద్దేశంతో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ డ్రాకు ప్రతిపాదించాడు. అందుకు భారత్ నిరాకరించడంతో అతను స్టెడ్జింగ్‌కు దిగాడు. బ్రూక్, డక్కెట్ బౌలింగ్‌లో సెంచరీలు చేస్తారా? అని అవహేళన చేశాడు. ఆ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. భారత క్రికెటర్లను అవహేళన చేసిన స్టోక్స్‌పై భారత అభిమానులు మండిపడుతున్నారు. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఫైర్ అయ్యాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో స్పందించాడు. తానే కెప్టెన్ అయితే చివరి 15 ఓవర్లు కూడా ఆడించేవాడినని చెప్పాడు. స్టీవ్ హార్మిసన్ ఫ్లింటాఫ్‌ను తీసుకొచ్చినా జడేజా నో చెప్పడని, బ్రూక్‌తో బౌలింగ్ చేయించడం స్టోక్స్ తప్పిదమన్నాడు.

‘ద్వంద్వ ప్రమాణాలు అనే పదం విన్నారా?. చివరి 10 నిమిషాల్లో ఇంగ్లాండ్ తీరు అలాగే ఉంది. డ్రాకు ఇద్దరు కెప్టెన్లు అంగీకరించాలి. అది రూల్. స్టోక్స్ ముందు బౌలర్లు అలసిపోవద్దని కోరుకున్నాడు. ‘నేను ఫ్రస్టేట్ అయ్యాను. నువ్వు కూడా హ్యాపీగా ఉండొద్దు’అనేది రెండోది. తొలి పాయింట్ ప్రకారం భారత్ చేసింది సరైందే. నేను కెప్టెన్ అయితే చివరి వరకూ ఆడించేవాడిని.’అని గట్టిగ కౌంటర్ ఇచ్చారు. ‘మీరు గెలవలేదు నిరాశ చెంది ఉంటారు. మీ ఆటగాళ్లతో ఫైట్ చేయండి. బంతిని కొట్టండి. ఇంకా ఏదేనా చేయండి. కానీ, ‘నేను ఫ్రస్టేట్ అయ్యాను. నువ్వు సెంచరీ చేయొద్దు. ఏడ్చుకుంటూ వెళ్లు’ అంటే ఎంత వరకు కరెక్ట్. ఉదయం నుంచి జడేజా మీ బౌలర్లతో యుద్ధం చేస్తున్నాడు. అతను సెంచరీని వదలుకోవాలా?. ‘హ్యారీ బ్రూక్ బౌలింగ్ సెంచరీ చేస్తావా?’అని అంటావా?. అతనికి సెంచరీ కావాలి. బ్రూక్‌నే కాదు స్టీవ్ హార్మిసన్, ఫ్లింటాఫ్‌లను తీసుకరా. అతను నో చెప్పడు. బ్రూక్‌తో బౌలింగ్ చేయించడం నీ తప్పు.’అంటూ స్టోక్స్‌పై అశ్విన్ మండిపడ్డాడు.


Next Story