- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు ఐపీఎల్ నుంచి బంగ్లా బౌలర్ ముస్తిఫిజుర్ రెహ్మాన్‌ను తొలగించడం వంటి కారణాలతో వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఐసీసీకి తెలియజేసింది. ఆటగాళ్ల భద్రత దృష్టా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ మ్యాచ్‌లను శ్రీలంకు తరలించాలని అభ్యర్థించింది. బీసీబీ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించినట్టు తెలుస్తోంది. టోర్నీ ప్రారంభానికి ఎంతో సమయం లేకపోవడంతో మ్యాచ్‌లను తరలించే ప్రసక్తే లేదని చెప్పినట్టు సమాచారం. కావాలంటే భారత్‌లోనే ఇతర వేదికల్లో ఆడాలని సూచించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచకప్‌లో గ్రూపు మ్యాచ్‌లను బంగ్లా జట్టు కోల్‌కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. చెన్నయ్, తిరువనంతపురంలో ఆడాలని బీసీబీకి ఐసీసీ సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై ఐసీసీ.. బీసీసీఐతో కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. మ్యాచ్‌ల నిర్వహణకు తమిళనాడు క్రికెట అసోసియేషన్, కేరళ క్రికెట్ అసోసియేషన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఐసీసీ అధికారికంగా ప్రకటిస్తేనే ఓ క్లారిటీ వస్తుంది.






