- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICC Mens T20 World Cup : టీ20 వరల్డ్ కప్ టికెట్లపై అప్‌డేట్ ఇచ్చిన ఐసీసీ

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్-2026కు సంబంధించిన రెండో దశ టికెట్ల అమ్మకాలను ఐసీసీ బుధవారం ప్రారంభించింది. డిసెంబర్ 11న టికెట్ల సేల్‌ను మొదలుపెట్టింది. అప్పుడు 24 మ్యాచ్‌ల టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టింది. తాజాగా మిగతా గ్రూపు మ్యాచ్‌లతోపాటు నాకౌట్ గేముల టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో పాకిస్తాన్, యూఎస్‌ఏ, నమీబియాతో భారత్ ఆడే గ్రూపు మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్లు ఇంకా రిలీజ్ చేయలేదు. అభిమానులకు వరల్డ్ కప్ సమరాన్ని మరింత దగ్గర చేయడానికి ఐసీసీ టికెట్లను సరసమైన ధరలకే ఇవ్వనుంది. పలు మ్యాచ్‌ల టికెట్ ధరలు రూ.100ల నుంచే మొదలుకానున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్‌కు భారత్‌తోపాటు శ్రీలంక కూడా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న వరల్డ్ కప్ మొదలుకానుంది. టికెట్లు https://tickets.cricketworldcup.com/ లేదా BookMyShowలో అందుబాటులో ఉంటాయి.






