ICC Test Rankings : 6వ ర్యాంక్‌కు దూసుకెళ్లిన పంత్.. అగ్రస్థానానికి ఇంకా ఎన్ని పాయింట్ల దూరంలో ఉన్నాడంటే?

by Harish |

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ టాప్-5కు చేరువయ్యాడు.

ICC Test Rankings : 6వ ర్యాంక్‌కు దూసుకెళ్లిన పంత్.. అగ్రస్థానానికి ఇంకా ఎన్ని పాయింట్ల దూరంలో ఉన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ టాప్-5కు చేరువయ్యాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో రెండు శతకాలు బాదిన అతను తన ర్యాంక్‌‌ను మరోసారి మెరుగుపర్చుకున్నాడు. బుధవారం ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో ఒక్క స్థానాన్ని అధిగమించి 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవలే పంత్ 801తో కెరీర్ టాప్ రేటింగ్ పాయింట్స్ సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్(889) అగ్రస్థానంలో ఉండగా.. అతని కంటే పంత్ కేవలం 88 రేటింగ్ పాయింట్స్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఇక, భారత్ తరపున పంత్ కంటే జైశ్వాల్(4వ ర్యాంక్) ముందు వరుసలో ఉన్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక్క స్థానం కోల్పోయి 21వ ర్యాంక్‌కు పడిపోయాడు. భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా టెస్టుల్లో నం.1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. జడేజా కూడా నం.1 ఆల్‌రౌండర్‌ హోదాను కాపాడుకున్నాడు.


Next Story