టీ20 వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ టికెట్ సేల్స్ షురూ.. మ్యాచ్‌లు ఎక్కడ?

by Phanindra |

టీ20 వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ టికెట్ సేల్స్‌ను ఐసీసీ మొదలుపెట్టింది. అయితే ఈ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయో తేలడం లేదు?

టీ20 వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ టికెట్ సేల్స్ షురూ.. మ్యాచ్‌లు ఎక్కడ?
X

దిశ, స్పోర్ట్స్: అద్భుతంగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచుల టికెట్లను అమ్మకాన్ని ఐసీసీ మొదలుపెట్టింది. క్రికెట్ అభిమానులు వెంటనే ఈ టికెట్లు కొనుగోలు చేసేందుకు క్యూలు కడుతున్నారు. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల ఇప్పటికీ ఈ మ్యాచ్‌లు జరిగే వేదికలు ఖరారు కాకపోవడం ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది. ఈ రెండు దేశాల పరిస్థితుల వల్ల ఆసాంతం భారత్‌లో జరగాల్సిన టోర్నీలో కొన్ని మ్యాచులను శ్రీలంకకు తరలించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ కనుక సెమీస్, ఫైనల్ చేరితే.. ఆ మ్యాచులు భారత్‌లో జరగవు. పాక్ కనుక ముందడుగు వేయకుంటే కోల్‌కతా, ముంబై వేదికలుగా సెమీఫైనల్స్ జరుగుతాయి. దీంతో పాక్ క్వాలిఫై అవ్వడంపై వేదికలు ఖరారయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు శ్రీలంక నాకౌట్స్ చేరినా ఒక సెమీఫైనల్‌ను శ్రీలంకలో నిర్వహిస్తామని ఐసీసీ తాజాగా ప్రకటించింది. అయితే శ్రీలంక, పాక్ రెండూ సెమీస్ చేరకపోతే పరిస్థితి ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

సెమీఫైనల్ వేదిక పరిస్థితి ఇదీ..

  • క్వాలిఫై అయిన జట్లను బట్టి తొలి సెమీఫైనల్‌ కోల్‌కతా లేదా కొలంబోలో జరుగుతుంది.
  • రెండో సెమీఫైనల్‌కు మాత్రం వాంఖడే వేదికకానుంది.
  • పాక్ కనుక సెమీస్‌కు చేరితే కొలంబోలో తొలి సెమీఫైనల్ ఆడుతుంది.
  • శ్రీలంక క్వాలిఫై అయితే.. మ్యాచ్ భారత్‌తో కాకపోతే కొలంబోలోనే ఆడుతుంది.
  • సెమీస్‌లో శ్రీలంక, భారత్ తలపడితే ఆ మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతుంది.
  • అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగనుంది. అయితే ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ చేరితే.. ఆ మ్యాచ్ కూడా కొలంబో వేదికగా జరుగుతుంది.
Next Story