- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC: ఐసీసీ నూతన సీఈవోగా సంజోగ్ గుప్తా.. ఆమోదించిన చైర్మన్ జై షా
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా సోమవారం సంజోగ్ గుప్తా (Sanjog Gupta) ఎన్నికయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా సోమవారం సంజోగ్ గుప్తా (Sanjog Gupta) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో సంజోగ్ గుప్తా ఐసీసీ చరిత్రలో ఏడో సీఈవోగా, ఉన్నత స్థానంలో ఎన్నికైన రెండో భారతీయుడిగా నిలిచాడు. అంతకుముందు జైషా (Jai Shah) ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ సీఈవోగా పదవీ విరమణ చేసిన జియోఫ్ అలార్డైస్ (Geoff Allardyce) స్థానంలో ఆయన సంజోగ్ గుప్తా నియమితులయ్యారు. కాగా, ఐసీసీ సీఈవో నియామక ప్రక్రియ మార్చి 2025లో ప్రారంభమైంది. ఈ పోస్టుకు గాను 25 దేశాల నుంచి 2,500కి పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో మొత్తం 12 మంది అప్లికేషన్లను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేశారు. ఐసీసీ నామినేషన్స్ కమిటీ, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్, ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు షమ్మీ సిల్వా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాలతో కూడిన కమిటీ సంజోగ్ గుప్తాను సీఈవోగా ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఆ నిర్ణయాన్ని ఐసీసీ చైర్మన్ జైషా కూడా ఆమోదించారు.






