ఐసీసీ ర్యాంకులు విడుదల.. అగ్రస్థానంలో అభిషేక్ శర్మ, బుమ్రా

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-30 09:17:58  IST  )

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) టెస్టు, టీ20 ఫార్మాట్‌ 2025 ర్యాంకులను విడుదల చేసింది.

ఐసీసీ ర్యాంకులు విడుదల.. అగ్రస్థానంలో అభిషేక్ శర్మ, బుమ్రా
X

దిశ, వెబ్ డెస్క్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) టెస్టు, టీ20 ఫార్మాట్‌ 2025 ర్యాంకులను విడుదల చేసింది. ఇంగ్లండ్-భారత్ మాంచెస్టర్ టెస్టు తర్వాత జూలై 30న ఐసీసీ ఈ ర్యాంకులను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా, భారత్ తరపున ఆఖరి రోజుల్లో ఒక్క టీ20 మ్యాచ్ ఆడకపోయినా, అభిషేక్ శర్మ (Abhishek sharma) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 829 పాయింట్లతో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో అభిషేక్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 ర్యాంక్‌ను సాధించిన మూడో భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనతను పొందారు.

ఇక ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జడేజా 422 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టెస్టు బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా టాప్ స్థానంలో నిలిచారు. ఇక గాయంతో కూడిన పరిస్థితుల్లో కూడా రిషభ్ పంత్ ఆడిన అర్ధశతకం అతడిని టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం ఎగబాకి ఏడవ స్థానానికి తీసుకెళ్లింది. ఇక జైస్వాల్ ఎనిమిదవ స్థానానికి జారిపోగా, శుభ్‌మన్ గిల్ తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నారు.

Next Story