బిగ్ రిలీఫ్..Jio Star తప్పుకోవడంపై ఐసీసీ క్లారిటీ

by velandi.Saikiran |

ఐసీసీ కీలక ప్రకటన చేసింది. జియో స్టార్ తో తన కాంటాక్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. క్రికెట్ మ్యాచ్ ల స్ట్రీమింగ్

బిగ్ రిలీఫ్..Jio Star తప్పుకోవడంపై ఐసీసీ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్‌: జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త. జియో స్టార్ తో తమ కాంట్రాక్టు కొనసాగుతుందని ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. గత నాలుగు రోజులుగా జియో స్టార్ పై అనేక రకాల వార్తలు వచ్చాయి. ఐసీసీ మీడియా హక్కుల నుంచి జియో స్టార్ తప్పుకున్నట్లు జాతీయ మీడియాలో కూడా ప్రచారం జోరు అందుకుంది. జియో స్టార్ స్థానంలో మరో కొత్త ఓటీటీ రాబోతున్నట్లు కూడా ప్రచారం చేశారు. దీంతో జియో యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ కీలక ప్రకటన చేసింది. జియో స్టార్ తో తన కాంటాక్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. క్రికెట్ మ్యాచ్ ల స్ట్రీమింగ్ రైట్స్ జియో రద్దు చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రకటన విడుదల చేసింది. వచ్చే టీ20 వరల్డ్ కప్ 2026, ఇతర ఐసీసీ ఈవెంట్లు కూడా నిరంతరంగా జియో స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు స్పష్టం చేసింది. ఎప్పటిలాగే జియో హాట్ స్టార్‌ లో మ్యాచ్ లు ఉచితంగా చూడవచ్చని తెలిపింది. అటు జియో కూడా ఇదే విషయాన్ని ప్రకటన ద్వారా తెలిపి క్లారిటీ ఇచ్చింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కు ఊర‌ట‌ లభించింది.

Next Story