- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICC: జియో హాట్‌స్టార్ ఔట్..రంగంలోకి ఆ మూడు ఓటీటీ సంస్థలు ?
జియో హాట్‌స్టార్ స్థానంలో మిగిలిన ఓటీటీ సంస్థలకు ఆహ్వానం కూడా పలికారట. టీ20 వరల్డ్ కప్ వరల్డ్ కప్ నకు సంబంధించిన

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు కేవలం రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐసీసీ మీడియా హక్కుల ఒప్పందం నుంచి జియో హాట్‌స్టార్ వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐసీసీకి జియో హాట్‌స్టార్ యాజమాన్యం సమాచారం కూడా ఇచ్చినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆర్థికపరమైన కారణాలు చూపి, ఈ మీడియా హక్కులను వదులుకుందట జియో హాట్‌స్టార్. అయితే జియో హాట్‌స్టార్ వైదొలిగినట్లు వార్తలు బయటకు వచ్చిన మరుక్షణమే, ఐసీసీ అలర్ట్ అయినట్లు చెబుతున్నారు.
జియో హాట్‌స్టార్ స్థానంలో మిగిలిన ఓటీటీ సంస్థలకు ఆహ్వానం కూడా పలికారట. టీ20 వరల్డ్ కప్ వరల్డ్ కప్ నకు సంబంధించిన మీడియా హక్కులను పొందేందుకుగాను మూడు ప్రధాన ఓటీటీ సంస్థలకు ఆహ్వానం పలికిందట ఐసీసీ. జియోస్టార్ నిష్క్రమణతో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లను ఐసీసీ సంప్రదించిందట. ఇందులో నెట్‌ఫ్లిక్స్ ఫైనల్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ నెట్‌ఫ్లిక్స్ కు ఐసీసీ మీడియా హక్కులు వెళితే, క్రికెట్ ఫ్యాన్స్ సబ్‌స్క్రిప్షన్ లేని, డబ్బులు పెట్టి చేసుకోవాల్సిందే.






