- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేం అలా అనలేదంటూ బంగ్లాకు షాకిచ్చిన ఐసీసీ..!
మేం అలా అనలేదంటూ బంగ్లాకు ఐసీసీ షాకిచ్చింది. మా వాదనలతో ఐసీసీ ఏకీభవించిందన్న బంగ్లా పరువు పోయింది.

దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వయిజర్ ఆసిఫ్ నజ్రుల్ పరువు పోయింది. ఐసీసీ సమావేశం తర్వాత భారత్‌లో ఆడేటప్పుడు మూడు సందర్భాల్లో తమకు సెక్యూరిటీ సమస్యలున్నాయని తెలపగా.. ఐసీసీ కూడా వాటికి అంగీకరించిందని నజ్రుల్ ప్రకటించాడు. ముస్తాఫిజుర్ ఆడేసమయంలో, బంగ్లాదేశ్ జెర్సీలతో అభిమానులు కనిపిస్తే, అలాగే బంగ్లా ఎన్నికల సమయంలో.. తమ ఆటగాళ్లకు భద్రతాపరమైన సమ్యలు వస్తాయని ఐసీసీకి నజ్రుల్ తెలిపామన్నాడు. వీటిపై ఐసీసీ కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రకటించాడు. అయితే అతను ప్రకటన చేసిన కాసేపటికే ఈ డిమాండ్లను తాము అంగీకరించలేదని, బీసీబీకి ఎలాంటి మద్దతు తెలపలేదని ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే టీ20 వరల్డ్ కప్ జరుగుతుందని స్పష్టంచేసింది. బంగ్లా జట్టును, వారి అధికారులను, మ్యాచ్ వేదికలను టార్గెట్ చేస్తూ ఎలాంటి బెదిరింపులకు కూడా రాలేదని ఐసీసీకి రిపోర్టులు అందినట్లు తెలుస్తోంది. దీంతో బంగ్లాదేశ్‌కు భారత్‌లో ఆడక తప్పేలా లేదు.






