- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. జూన్ 14న కన్ఫర్మ్ చేసిన ఐసీసీ!
మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్. జూన్ 14న ఈ రెండు జట్లు తలపడతాయని ఐసీసీ కన్ఫర్మ్ చేసింది.

దిశ, స్పోర్ట్స్: మరో ఐసీసీ పండుగకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ఏడాదిలో జరగనున్న మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను మంగళవారం నాడు ఐసీసీ ప్రకటించింది. పదో ఎడిషన్ టోర్నమెంట్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తోంది. జూన్ 12వ తేదీ నుంచి జులై 5 వరకు 12 జట్లు టీ20 వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. జూన్ 12న ఆతిథ్య ఇంగ్లండ్, శ్రీలంక మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. జులై 5న ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలో పాల్గొనే 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిల్యాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుంది. చివరి ఎడిషన్ టీ20 వరల్డ్ కప్ నెగ్గిన న్యూజిల్యాండ్.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతోంది.
ఇండియా ఈసారైనా..
2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళలు తేలిపోయారు. గ్రూప్-ఎలో ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచులు మాత్రమే నెగ్గి నాకౌట్‌కు చేరుకోలేకపోయారు. ఈ గ్రూపు నుంచి ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ నాకౌట్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించిన కివీస్ అమ్మాయిలు టైటిల్ ఎగరేసుకుపోయారు. టీ20 వరల్డ్ కప్‌లో 2020లో ఫైనల్ చేరడమే భారత్ అత్యుత్మ ప్రదర్శన. అప్పుడు కూడా ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. అయితే వన్డే వరల్డ్ కప్ విజేతలుగా ఈ టోర్నీలో అడుగుపెడుతున్న భారత్.. ఈసారైన మెరుగైన ప్రదర్శన చేసి పొట్టి ప్రపంచ కప్‌ను కూడా ముద్దాడాలని ఆశపడుతోంది.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..
- జూన్ 12, శుక్రవారం: ఇంగ్లాండ్ vs శ్రీలంక, ఎడ్జ్‌బాస్టన్ - రాత్రి 11:00
- జూన్ 13, శనివారం: స్కాట్లాండ్ vs ఐర్లాండ్, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ - మధ్యాహ్నం 03:00
- జూన్ 13, శనివారం: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ - సాయంత్రం 07:00
- జూన్ 13, శనివారం: వెస్టిండీస్ vs న్యూజిలాండ్, హాంప్‌షైర్ బౌల్ - రాత్రి 11:00
- జూన్ 14, ఆదివారం: బంగ్లాదేశ్ vs నెదర్లాండ్స్, ఎడ్జ్‌బాస్టన్ - మధ్యాహ్నం 03:00
- జూన్ 14, ఆదివారం: భారతదేశం vs పాకిస్తాన్, ఎడ్జ్‌బాస్టన్ - సాయంత్రం 07:00
- జూన్ 16, మంగళవారం: న్యూజిలాండ్ vs శ్రీలంక, హాంప్‌షైర్ బౌల్ - సాయంత్రం 07:00
- జూన్ 16, మంగళవారం: ఇంగ్లాండ్ vs ఐర్లాండ్, హాంప్‌షైర్ బౌల్ - రాత్రి 11:00
- జూన్ 17, బుధవారం: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్, హెడింగ్లీ - మధ్యాహ్నం 03:00
- జూన్ 17, బుధవారం: భారతదేశం vs నెదర్లాండ్స్, హెడింగ్లీ - సాయంత్రం 07:00
- జూన్ 17, బుధవారం: దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్, ఎడ్జ్‌బాస్టన్ - రాత్రి 11:00
- జూన్ 18, గురువారం: వెస్టిండీస్ vs స్కాట్లాండ్, హెడింగ్లీ - రాత్రి 11:00
- జూన్ 19, శుక్రవారం: న్యూజిలాండ్ vs ఐర్లాండ్, హాంప్‌షైర్ బౌల్ - రాత్రి 11:00
- జూన్ 20, శనివారం: ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్, హాంప్‌షైర్ బౌల్ - మధ్యాహ్నం 03:00
- జూన్ 20, శనివారం: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, హాంప్‌షైర్ బౌల్ - సాయంత్రం 07:00
- జూన్ 20, శనివారం: ఇంగ్లాండ్ vs స్కాట్లాండ్, హెడింగ్లీ - రాత్రి 11:00
- జూన్ 21, ఆదివారం: వెస్టిండీస్ vs శ్రీలంక, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ - మధ్యాహ్నం 03:00
- జూన్ 21, ఆదివారం: దక్షిణాఫ్రికా vs భారతదేశం, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ - సాయంత్రం 07:00
- జూన్ 23, మంగళవారం: న్యూజిలాండ్ vs స్కాట్లాండ్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ - మధ్యాహ్నం 03:00
- జూన్ 23, మంగళవారం: శ్రీలంక vs ఐర్లాండ్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ - రాత్రి 07:00
- జూన్ 23, మంగళవారం: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్, హెడింగ్లీ - రాత్రి 11:00
- జూన్ 24, బుధవారం: ఇంగ్లాండ్ vs వెస్టిండీస్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ - రాత్రి 11:00
- జూన్ 25, గురువారం: భారతదేశం vs బంగ్లాదేశ్, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ - రాత్రి 07:00
- జూన్ 25, గురువారం: దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ - రాత్రి 11:00
- జూన్ 26, శుక్రవారం: శ్రీలంక vs స్కాట్లాండ్, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ - రాత్రి 11:00
- జూన్ 27, శనివారం: పాకిస్తాన్ vs నెదర్లాండ్స్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ - మధ్యాహ్నం 03:00
- జూన్ 27, శనివారం: వెస్టిండీస్ vs ఐర్లాండ్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ - సాయంత్రం 07:00
- జూన్ 27, శనివారం: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్, ది ఓవల్ - రాత్రి 11:00
- జూన్ 28, ఆదివారం: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ - మధ్యాహ్నం 03:00
- జూన్ 28, ఆదివారం: ఆస్ట్రేలియా vs ఇండియా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ – సాయంత్రం 07:00
- జూన్ 30, మంగళవారం: సెమీ ఫైనల్-1, ది ఓవల్ – సాయంత్రం 07:00
- జూలై 2, గురువారం: సెమీ ఫైనల్-2, ది ఓవల్ – రాత్రి 11:00
- జూలై 5, ఆదివారం: ఫైనల్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ – సాయంత్రం 07:00






