Ibrahim Zadran: ఇబ్రహీం జద్రాన్ సూపర్ సెంచరీ.. సచిన్, గంగూలీ రికార్డులు గల్లంతు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-27 04:29:29  IST  )

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతం చేసింది.

Ibrahim Zadran: ఇబ్రహీం జద్రాన్ సూపర్ సెంచరీ.. సచిన్, గంగూలీ రికార్డులు గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతం చేసింది. బుధవారం ఇంగ్లాండ్‌ (England)తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (177) చేసి భారత క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) రికార్డులను బద్దలుకొట్టాడు.

లాహోర్‌ (Lahore)లోని వేదికగా గడాఫీ స్టేడియం (Gaddafi Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల కోల్పో్యి 325 పరుగులు చేసింది. అయితే, 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన జట్టును ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఏకంగా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ.. ఆఫ్టన్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ హష్మతుల్లా (40), మహ్మద్ నబీ (40), షహిదీ (40)తో కలిసి జద్రాన్‌ చెలరేగిపోయాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

రికార్డులు గల్లంతు..

కాగా, ప్రస్తుతం జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీలో లాహోర్‌ (Lahore)లో ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన మ్యాచ్‌లో బెన్ డకెట్ 165 పరుగులు చేయగా. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరుగా ఉంది. అయితే ఇప్పుడు ఆ రికార్డును ఇబ్రహీం జద్రాన్ అధిగమించాడు. వారి తరువాత 2004లో ది ఓవల్‌ (The Oval)లో యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో నాథన్ ఆస్ట్లే 145 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక 2002లో ఇండియాతో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో ఆండీ ఫ్లవర్ (Andi Flower) 145 పరుగులు, 2000వ సంవత్సరంలో నైరోబీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ అజేయంగా 141 పరుగులు, 1998లో ఢాకాలో సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 141 పరుగులు, 2009లో సెంచూరియన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రేమ్ స్మిత్ 141 పరుగులు చేశాడు. తాజాగా, బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Next Story