కచ్చితంగా ఫామ్‌లోకి వస్తా.. : సూర్యకుమార్

by Harish |

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేస్తున్నా ప్లేయర్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు.

కచ్చితంగా ఫామ్‌లోకి వస్తా.. : సూర్యకుమార్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేస్తున్నా ప్లేయర్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. కొంతకాలంగా అతను పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ విఫలమయ్యారు. ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య.. తన పేలవ ఫామ్‌పై స్పందించాడు. కచ్చితంగా తిరిగి ఫామ్‌లోకి వస్తానని దీమా వ్యక్తం చేశాడు. ‘ఎక్కడ తప్పు జరుగుతుందో నాకు తెలుసు. అందుకు ఏం చేయాలో కూడా నాకు తెలుసు. ప్రపంచకప్‌కు ముందు దానిపై కష్టపడటానికి నాకు కాస్త సమయం ఉంది. అదొక చిన్న అడ్డంకి మాత్రమే. దాన్ని అధిగమిస్తాను.’అని సూర్య చెప్పుకొచ్చాడు. సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించడంపై స్పందిస్తూ.. తనకు చాలా బాధ్యతతో కూడుకున్నదన్నాడు. అలాగే, సొంత అభిమానుల ముందు ఆడటం సవాల్‌ అని కూడా ఒప్పుకున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన సూర్య కేవలం 34 రన్సే చేయడం గమనార్హం. 21 మ్యాచ్‌ల్లో అతను 13.62 సగటుతో 218 పరుగులే చేశాడు. ఈ ఏడాది సూర్య ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు.


Next Story