నేను సన్ రైజర్స్ లోనే కొనసాగుతాను : క్రికెటర్ క్లారిటీ

by Muthe.Rajitha |

తెలుగు క్రికెటర్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(Nithish Kumar Reddy) ఐపీఎల్(IPL) లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే.

నేను సన్ రైజర్స్ లోనే కొనసాగుతాను : క్రికెటర్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు క్రికెటర్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(Nithish Kumar Reddy) ఐపీఎల్(IPL) లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. గత ఐపీఎల్ వేలానికి ముందే హైదరాబాద్ సన్ రైజర్స్(SRH) నితీష్ కుమార్ ను రూ.6 కోట్లకు తన వద్దే ఉంచుకుంది. అయితే నితీష్ కుమార్ ఫ్రాంచైజీ మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తనకు ఆల్ రౌండర్ గా అవకాశాలు రావడం లేదని, ఫ్రాంచైజీ మారడం ఖాయం అంటూ వార్తలు రావడం పట్ల నితీష్ కుమార్ స్పందించారు.

తనపై వస్తున్నా వార్తలను కొట్టిపడేశారు. తమకు సన్ రైజర్స్ తో చాలా ఏళ్ల అనుబంధం ఉందని, తాను జట్టు మారే ప్రసక్తే లేదని తెలియజేశాడు. ఈ మేరకు నితీష్ తన ఎక్స్ ఖాతా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసారు. 2025 ఐపీఎల్ లో 13 మ్యాచులు ఆడి 182 పరుగులు చేసాడు.

Next Story