- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : తన కెరీర్ ఆరంభంలో తనను టీ20 ప్లేయర్‌గా పరిగణించలేదని, టెస్టు ఆటగాడిగా ముద్ర వేశారని భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న అతను సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. తాజాగా జియో హాట్‌స్టార్ నిర్వహించిన ‘సూపర్‌స్టార్స్’ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. రెడ్ బాల్ బ్యాటర్ ఇమేజ్ నుంచి బయటపడటానికి ఎంతో కష్డపడ్డానని చెప్పాడు. ‘10ఏళ్ల క్రితం టీ20 జట్టులో భాగం కావడానికి ఎంతో ప్రయత్నించా. కానీ, నన్ను టీ20 ప్లేయర్‌గా పరిగణించలేదు. కనీసం వైట్ బాల్ ప్లేయర్‌గానూ చూడలేదు. నన్ను ఒక టెస్టు ప్లేయర్ ముద్ర వేశారు. వైట్ బాల్ గేమును మెరుగుపర్చుకుని ఆ ఇమేజ్ నుంచి బయటపడి, ఇంత దూరం రావడం గర్వకారణం. ఈ ప్రయాణంలో తప్పులు చేశాను. ఇంకా మెరుగు పర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. కానీ, నేను ఎప్పుడు ఆడినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే చూస్తా.’అని రాహుల్ తెలిపాడు.
రాహుల్ భార్య, అతియా శెట్టి దంపతులు గతేడాది కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తండ్రి కావడంపై రాహుల్ స్పందిస్తూ.. ‘తండ్రి కాకముందు నా జీవితంలో ప్రశాంతత, సంతోషం ఉన్నాయని అనుకునేవాన్ని. కానీ, అది పొరపాటు. నా బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడే నాకు నిజమైన ప్రశాంతత, ఆనందం తెలిసింది. నా కూతురు నవ్వినప్పుడు, నన్ను హగ్ చేసుకున్నప్పుడు, ముద్దు పెట్టినప్పుడు.. నా గాయాలు, బాధ, ఆందోళనలను అన్నీ మర్చిపోతా. ఏడాదికాలంగా అది నా క్రికెట్ కూడా సహాయపడుతుంది.’అని చెప్పాడు. అలాగే, తాను క్రికెట్‌ను చూసే విధానం కూడా మారిందని, అతిగా ఆలోచించడం మానేశానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2026లో రాహుల్ 9 మ్యాచ్‌ల్లో 433 రన్స్ చేశాడు. ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌లో రేసులో ఉన్న అతను ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు.






