ఆ ఓటమితో కుంగిపోయా.. కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది : రోహిత్

by Harish |

ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023 ఓటమి తనను ఎంతో బాధించిందని భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

ఆ ఓటమితో కుంగిపోయా.. కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది : రోహిత్
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023 ఓటమి తనను ఎంతో బాధించిందని భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ వన్డే వరల్డ్ కప్-2023ని గుర్తు చేసుకున్నాడు. ‘ప్రతి ఒక్కరూ చాలా నిరాశ చెందారు. ఏం జరిగిందో మేము నమ్మలేకపోయాం. నాకు వ్యక్తిగత అది చాలా కఠినమైన సమయం. 2022‌లో నేను కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి ఆ ప్రపంచకప్ కోసం ఎంతో కష్టపడ్డా. నా ఏకైక లక్ష్యం వరల్డ్ గెలవడమే. కాబట్టి, నేను చాలా కుంగిపోయా. అప్పుడు నా శరీరం‌లో శక్తి లేదు.’అని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. అలాగే, ఆ ఓటమి నుంచి తిరిగి కోలుకోవడానికి తనకు రెండు నెలల సమయం పట్టిందని చెప్పాడు. ‘ఆ ఓటమి నాకు పెద్ద పాఠం. నిరాశను ఎలా ఎదుర్కోవాలో?.. తిరిగి ఎలా పునరాలోచించుకోవాలో?.. తిరిగి కొత్తగా ఎలా ఆరంభించాలో? తెలుసుకున్నా. టీ20 ప్రపంచకప్-2024పై దృష్టి మళ్లించా. ఇప్పుడు చాలా ఈజీగా చెబుతున్నా కానీ అప్పుడు చాలా కఠినమైన పరిస్థితి.’అని రోహిత్ చెప్పుకొచ్చాడు. రోహిత్ నాయకత్వంలో గతేడాది టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే.


Next Story