పాపం పాక్.. వాళ్లను చూస్తే జాలి కలుగుతుంది : ఇషాంత్ శర్మ

by Harish |

ఆసియా కప్‌లో టీమిండియాతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

పాపం పాక్.. వాళ్లను చూస్తే జాలి కలుగుతుంది : ఇషాంత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో టీమిండియాతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో పాక్ ప్రదర్శనపై భారత సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ను చూస్తే జాలి కలుగుతుందన్నాడు. టీమిండియాతో పోలిస్తే పాకిస్తాన్‌కే ఒత్తిడి ఎక్కువ అని అభిప్రాయపడ్డాడు. ‘పాకిస్తాన్‌పై ఇప్పటికే ఒత్తిడి ఎక్కువగా ఉంది. వాళ్ల అభిమానులు స్టాండ్స్‌ నుంచి అరుస్తూ ఉంటారు. మనం కూడా ఒత్తిడి పెంచితే ఆ జట్టు ఎలా హ్యాండిల్ చేస్తుందో అని ఆలోచిస్తే వారిపై నాకు బాధ కలుగుతుంది.’అని చెప్పాడు. అలాగే, ప్రస్తుత పాక్ జట్టుతో పోటీ లేదన్నాడు. పాక్ దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పుడు భారత్, పాక్ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడి ఉండేదన్నాడు. ‘వసీం అక్రమ్, వాకర్ యూనిస్, షోయబ్ అక్తర్, సక్లైన్ ముస్తాక్, అఫ్రిది లాంటి వాళ్లు ఉన్న రోజుల్లో భారత్, పాక్ మ్యాచ్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉండేది. వారందరూ గొప్ప ప్లేయర్లు.’అని వ్యాఖ్యానించాడు.


Next Story