కాన్సర్ గురించి ఎందుకు చెప్పావ్... ఆకాష్ దీప్ పై సోదరి కామెంట్!

by velandi.Saikiran |   (  Updated:2025-07-08 14:23:20  IST  )

టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రె

కాన్సర్ గురించి ఎందుకు చెప్పావ్... ఆకాష్ దీప్ పై సోదరి కామెంట్!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య 2 టెస్టులు ఫినిష్ అయ్యాయి. మరో మూడు టెస్టులు మిగిలి ఉన్నాయి. అయితే రెండో టెస్టు నేపథ్యంలో.. ఎవరు ఊహించని విధంగా... ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ( Akash Deep) రంగంలోకి దిగి టీమిండియాను గెలిపించాడు. అద్భుతంగా ఆడి... ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. అయితే టీమిండియా గెలిచిన తర్వాత.. ఈ విజయాన్ని క్యాన్సర్ తో బాధపడుతున్న తన సోదరికి అంకితం చేశారు ఆకాష్ దీప్.

అయితే క్యాన్సర్ గురించి ఆకాష్ దీప్ బహిరంగంగా వెల్లడించడంపై ఆయన సోదరీ తాజాగా స్పందించింది. ఈ విషయంపై మీడియాతో కూడా ఆకాష్ సోదరి మాట్లాడారు. నేను ఇండియాలో చాలా బాగున్నాను అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీమిండియా కోసం... బాగా వర్క్ చెయ్ అంటూ ఆకాష్ ను ఎంకరేజ్ చేశారు. ఆకాష్ దీప్... తన హెల్త్ గురించి బహిరంగంగా మాట్లాడతాడని.. ఎప్పుడు అనుకోలేదు.. ముందస్తు సమాచారం లేకుండానే.. ఇంగ్లాండ్ మీడియాతో పేర్కొన్నారు అని కాస్త ఎమోషనల్ అయ్యారు. మేము దీన్ని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆకాష్ మాత్రం ఎమోషనల్ అయి ఈ విషయాన్ని చెప్పినట్లు ఉన్నాడని వెల్లడించారు ఆయన సోదరి.

Next Story