- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, స్పోర్ట్స్ : హైదరాబాద్ బౌలర్ ఎడ్ల సృజనకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఆడే అవకాశం వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను తమ జట్టులోకి తీసుకుంది. ఢిల్లీ జట్టుకు చెందిన మమత మడివాలా, దీయా యాదవ్ గాయాల కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో సృజనకు చాన్స్ దక్కింది. ఢిల్లీ రూ.10 లక్షలకు ఆమెతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు ఢిల్లీ జట్టుకే సృజన నెట్ బౌలర్‌గా వ్యవహరించింది. నెట్ సెషన్స్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో ఆమెకు ఢిల్లీ చాన్స్ ఇచ్చింది. పంజాబ్ ఆల్‌రౌండర్ ప్రగతి సింగ్‌ను కూడా ఢిల్లీ జట్టులో చేరనుంది. ప్రగతి పంజాబ్ మహిళల జట్టు, అండర్-19లో భారత్ ‘బి’, భారత్ ‘ఈ’ జట్లకు ఆడింది. ఢిల్లీ టీమ్ శనివారం బెంగళూరుతో తలపడనుంది. ఇప్పటివరకు ఆ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండింట మాత్రమే గెలిచింది.
Next Story






