- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB కి హైకోర్టులో భారీ ఊరట
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న RCB ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనలో 11 మంది మరణించి, 56 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న RCB ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనలో 11 మంది మరణించి, 56 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు భారీ ఊరట కల్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ అరెస్ట్ చేయవద్దని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి ఆర్సీబీ, ఈవెంట్ నిర్వహణ సంస్థ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తమకు ఈ ఘటనతో సంబంధం లేదని, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎవరినీ అరెస్టు చేయవద్దని ఆదేశిస్తూ.. విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్ట్. కాగా కర్ణాటక హైకోర్టు స్వయంగా స్వీకరించిన సుమోటో కేసుపై కూడా రేపే విచారణ జరుగనుంది. ఆర్సీబీ, డీఎన్ఎ ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యం, పోలీసుల అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఉచిత పాస్‌లు ప్రకటించడం వల్ల గందరగోళం, తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనపై సీఐడీ దర్యాప్తు, రిటైర్డ్ జస్టిస్ జాన్ మైఖేల్ డి’కున్హా నేతృత్వంలో కమిషన్, మెజిస్ట్రేట్ విచారణను ఏర్పాటు చేసింది.
బెంగళూరు పోలీస్ కమిషనర్‌తో సహా ఐదుగురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. ఆర్సీబీ, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం, గాయపడినవారి వైద్య ఖర్చులను భరించినట్లు ప్రకటించాయి. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ నాయకులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.






