- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారిద్దరి వల్లే సెంచరీ చేయగలిగా : జైశ్వాల్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సంచలన బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సంచలన బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌లో ఆడుతున్న తొలి టెస్టులోనే శతకం నమోదు చేశాడు. తొలి రోజు అనంతరం ధ్రువ్ జురెల్‌తో కలిసి జైశ్వాల్ బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. తాను రాణించడం వెనుక జస్ప్రిత్ బుమ్రా, హర్షిత్ రాణా పాత్ర ఉందన్నాడు. అలాగే, భారత్ ఏ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఉపయోగపడిందని చెప్పాడు. ‘ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో బుమ్రా, రాణా అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను నా వికెట్ కాపాడుకోవడానికి చూశా. ఆ మ్యాచ్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను క్రీజులో ఉంటే పరుగులు చేయగలనని నమ్మా. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ’అని తెలిపాడు. అలాగే, కేఎల్ రాహుల్ అనుభవం కూడా తన ఆట మెరుగుపడటానికి కారణమన్నాడు. ‘రాహుల్‌కు చాలా అనుభవం ఉంది. అతని చాలా సేపు మాట్లాడటం వల్ల ఎక్కడ పరుగులు చేయగలం, ఇన్నింగ్స్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలం అనే విషయాలు అర్థమయ్యాయి. మేమిద్దరం చాలా ప్రాక్టీస్ చేశాం. అందుకే, ఒకరి ఆలోచనలను మరొకరం అర్థం చేసుకుంటున్నాం.’అని జైశ్వాల్ చెప్పుకొచ్చాడు.






