IPL 2025 : ఆర్సీబీపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న ఫ్యాన్స్

by Harish |

ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు హాట్ కామెంట్స్ చేశాడు.

IPL 2025 :  ఆర్సీబీపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు..  మండిపడుతున్న ఫ్యాన్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు హాట్ కామెంట్స్ చేశాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలవకూడదని ప్రార్థిస్తున్నానని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న రాయుడు పలు విషయాలు గురించి ప్రస్తావించాడు. ఆర్సీబీ గురించి మాట్లాడుతూ..‘బెంగళూరు గెలిస్తే చాలా సంతోషిస్తా. కానీ, వాళ్లకు వాళ్లే శత్రువులని నాకు చాలా సార్లు అనిపిస్తుంది. ఆ జట్టులోకి వెళ్లిన వారందరూ కోహ్లీలాగా ఉండాలనుకుంటారు. హెయిర్ స్టైల్, బాడీ ఇతర అంశాల్లో విరాట్‌ను ఇమిటేట్ చేయాలని చూస్తారు. కానీ, అతనిలా బ్యాటింగ్ చేయలేరు. ఆటపై అతనికున్న ప్యాషన్ ఉండదు. ముందు ఆటపై ఫోకస్ పెట్టండి’ అని చెప్పాడు.

ఆర్సీబీ కూడా సమయం వచ్చినప్పుడు టైటిల్ గెలుస్తుందన్నాడు. అయితే, ఈ సీజన్ మాత్రం గెలవొద్దని కోరుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నయ్ లేదా ముంబై విజేత నిలువాలని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ రాయుడుపై మండిపడుతున్నారు. ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్‌కు చేరినా నిరాశే ఎదురైంది. గతేడాది సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఆర్సీబీ ఎలిమినేటర్‌లో పరాజయం పాలైంది. వచ్చే సీజన్‌లో కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


Next Story