హాకీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసియా కప్ మ్యాచ్‌లకు ఫ్రీ ఎంట్రీ

by Harish |

హాకీ అభిమానులకు హాకీ ఇండియా భారీ గుడ్ న్యూస్ చెప్పింది.

హాకీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసియా కప్ మ్యాచ్‌లకు ఫ్రీ ఎంట్రీ
X

దిశ, స్పోర్ట్స్ : హాకీ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ఆసియా కప్ మ్యాచ్‌లను స్టేడియాల్లో ఉచితంగా చూడొచ్చు. అవును.. హాకీ ఇండియా అభిమానులకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిరి హాకీ స్టేడియంలో హాకీ ఆసియా కప్‌కు జరగనుంది. ఈ టోర్నీ‌లోని అన్ని మ్యాచ్‌లను ఫ్రీగా చూడొచ్చని హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ మాట్లాడుతూ..‘రాజ్‌గిరిలో పురుషుల హాకీ ఆసియా కప్ నిర్వహించడం భారత హాకీకి చారిత్రాత్మకమైన ఘట్టం. ఇందులో ప్రతి అభిమానిని భాగస్వామ్యం చేయాలనుకున్నాం. ఉచిత ప్రవేశం ద్వారా క్రీడలను మరింత దగ్గరికి తీసుకురావడం, కుటుంబాలు, విద్యార్థులు, యువ అథ్లెట్లు ప్రపంచ స్థాయి హాకీని చూసేలా చేయడం మా లక్ష్యం. ఇది కేవలం టోర్నమెంటే కాదు. ఇది వేడుక.’అని తెలిపారు. ఉచిత టికెట్ కోసం హాకీ ఇండియా యాప్ లేదా WWW.Ticketgenie.inలో నమోదు చేసుకోవాలి. ప్రక్రియ పూర్తయ్యాక వర్చువల్ టికెట్ లభిస్తుంది. ఆ వర్చువల్ టికెట్‌తో స్టేడియాల్లోకి ఎంట్రీ కావొచ్చు.


Next Story