మరో మైలురాయికి చేరువలో హిట్ మ్యాన్.. 41 పరుగులు చేస్తే చరిత్ర పుటల్లోకి..

by Kema Shiva Kumar |

ప్రత్యర్థి జట్లకు అరివీర భయంకర బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో మైలురాయికి చేరువయ్యాడు.

మరో మైలురాయికి చేరువలో హిట్ మ్యాన్.. 41 పరుగులు చేస్తే చరిత్ర పుటల్లోకి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యర్థి జట్లకు అరివీర భయంకర బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో మైలురాయికి చేరువయ్యాడు. ఇవాళ సౌతాఫ్రికాతో జరగబోయే రెండో వన్డేలో మరో 41 పరుగులు చేస్తే.. 20,000 అంతర్జాతీయ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో నాల్గవ ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్‌‌లో 503 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ కెరీర్ మొత్తంలో 19,959 పరుగులు చేశాడు. టెస్టులలో 67 మ్యాచ్‌లు ఆడి 4,301 పరుగులు, వన్డేల్లో 11,427, టీ20ల్లో 4,231 పరుగులు చేశాడు. అందులో 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2025లో 12 వన్డేలు ఆడిన రోహిత్ 51 సగటుతో 561 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 అర్ధ శతకాలు ఉన్నాయి. కాగా, రోహిత్ ఈ మైలురాయిని ఈరోజు సౌతాఫ్రికాతో రాయ్‌పూర్ (Raipur) వేదికగా జరగబోయే రెండో వన్డేలోనే అందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి వన్డేలో హిట్‌మ్యాన్ 51 బంతుల్లో 57 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 20 వేల ఇంటర్నేషనల్ రన్స్ క్లబ్‌లో 34,357 పరుగులతో సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. రెండో స్థానంలో 27,808 పరుగులతో విరాట్ కోహ్లీ, 24,064 పరుగులతో మూడో స్థానంలో రాహుల్ ద్రావిడ్ ఉన్నారు.

Next Story