- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్ కామెంట్స్ వైరల్
హిందీ భాషపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : హిందీ భాషపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హిందీ జాతీయ భాష కాదని వ్యాఖ్యానించాడు. శుక్రవారం చెన్నయ్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ స్నాతకోత్సవానికి అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. ఇక్కడ ఇంగ్లిష్, తమిళ్, హిందీ ఎంత మందికి అర్థమవుతుందని అడిగాడు. ఇంగ్లిష్, తమిళ్ అర్థమవుతుందని ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు తెలపగా.. హిందీ గురించి అడిగినప్పుడు సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడు అశ్విన్ మాట్లాడుతూ..‘ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. హిందీ మన జాతీయ భాష కాదు. అధికారిక భాష మాత్రమే.’ అని తెలిపాడు.
అలాగే, తాను ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే క్రికెటర్‌గా మారనని గుర్తు చేశాడు. ‘నన్ను ఎవరైనా ఏం చేయలేవంటే దాన్ని చేసి చూపించాలనిపిస్తుంది. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు క్రికెటర్‌గా రాణించలేవని అన్నారు. కష్టపడి వారికి సమాధానం చెప్పాను. ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరైనా కెప్టెన్ అవ్వలేవు అంటే ఇంకా కష్టపడేవాడిని’ అని చెప్పాడు. సవాళ్లు ఎదురైనప్పుడు తాము ఎంచుకున్న మార్గాన్ని వదలిపెట్టొద్దని, పట్టుదలతో ఉండాలన్నాడు. ఎప్పుడూ నిత్య విద్యార్థిగా ఉంటూ నేర్చుకోవాలని చెప్పాడు. అయితే, హిందీ భాషపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దాలని చూస్తుందని తమిళనాడులో అధికార పార్టీ డీఎంకేతోపాటు పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న తరుణంలో అశ్విన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
- Tags
- #ashwin






