- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత జట్టులో కల్లోలం..మరో ప్లేయర్ కు అనారోగ్యం !
ఇండియా జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మకు వైరల్ ఫీవర్ సోకినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ కొనసాగుతున్న నేపథ్యంలో భారత జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభం కాకముందే తిలక్ వర్మ గాయం బారిన పడగా, ఆ తర్వాత కోలుకున్నాడు. ఇక డేంజర్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కంటే పది రోజుల ముందు గాయపడ్డాడు. ఇంకా అతడు కోలుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇంతలోనే ఈ టోర్నమెంట్ నుంచి గాయం బారిన పడ్డ హర్షిత్ రాణా కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగాడు.
భారత జట్టులో కల్లోలం..మరో ప్లేయర్ కు అనారోగ్యం !
అంత సెట్ అయిందని అనుకునే లోపే, బుమ్రాకు వైరల్ ఫీవర్స్ అవుతుందట. దీంతో అమెరికాతో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు బుమ్రా. రెండో మ్యాచ్ ఆడే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇండియా జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మకు వైరల్ ఫీవర్ సోకినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వైరల్ ఫీవర్ కారణంగా దాదాపు నాలుగు రోజుల పాటు అభిషేక్ శర్మ రెస్టు తీసుకోవాలని అంటున్నారు. అదే జరిగితే ఈ నెల 12వ తేదీన జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ సిద్ధంగా ఉంటాడా ? లేడా? అనేది క్లారిటీ లేదు. ఇలా వరుసగా గాయాలు, వైరల్ ఫీవర్లు ఇండియాను వేధిస్తున్నాయి. ఇలాగే భారత ప్లేయర్లు ఇబ్బందులు పడితే, టైటిల్ గెలవడం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.






