- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCA కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్.. హైకోర్ట్ కీలక నిర్ణయం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని కోరుతూ సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ తెలంగాణ హైకోర్టు(High Court)లో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని కోరుతూ సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ తెలంగాణ హైకోర్టు(High Court)లో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. కాగా ఇదివరకే HCA బాధ్యతలను నిర్వహించేందుకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును నియమిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు... ఈ ఉత్తర్వులు మూడు వారాలపాటు అమల్లో ఉంటాయని పేర్కొంది. HCAలో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై సీబీఐ(CBI) విచారణ కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లో BCCI, CBI, HCAను ప్రతివాదులుగా చేర్చింది సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్.
HCA ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ గాంధీ స్టేడియం నిర్మాణం, కానోపీలు, ఫ్లడ్‌లైట్లు వంటి ఒప్పందాలలో రూ. 2-3 కోట్ల నష్టం వాటిల్లినట్లు CID అధికారులు ఇప్పటికే గుర్తించారు. అలాగే జగన్ మోహన్ రావు అక్రమ పద్ధతిలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారని కూడా తేల్చింది. వీటన్నిటీ పిటిషన్లో పేర్కొంటూ... రాష్ట్ర స్థాయి దర్యాప్తు సరిపోదని, ఈ కేసును మరింత లోతుగా విచారణ జరపడానికి సీబీఐ విచారణ అవసరమని సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ పేర్కొంది. ఇప్పటికే హైకోర్టు HCAపై ఆర్థిక ఆంక్షలు విధించగా, ఈడీ రూ. 51.29 లక్షల ఆస్తులను జప్తు చేసింది.






