GST: ఐపీఎల్ అభిమానులకు బీఎస్టీ షాక్.. కొత్త మార్పులతో టికెట్ ధరలు ఎంత పెరుగుతాయో తెలుసా?

by Prasad Jukanti |   (  Updated:2025-09-04 07:07:29  IST  )

జీఎస్టీ సంస్కరణలో ఐపీఎల్ అభిమానులకు షాకి ఇవ్వబోతున్నాయి.

GST: ఐపీఎల్ అభిమానులకు బీఎస్టీ షాక్.. కొత్త మార్పులతో టికెట్ ధరలు ఎంత పెరుగుతాయో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ (IPL) లవర్స్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. మ్యాచ్ లను నేరుగా స్టేడియంలో చూసి ఆస్వాధించాలనుకునే వారికి జీఎస్టీ భారం భారీగా మోపింది. జీఎస్టీ (GST) విధానంలో కీలక మార్పులు చేస్తూ నిన్న జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పన్ను స్లాబుల్లో చేసిన మార్పుల కారణంగా లగ్జరీకి చెందినవన్నీ 40 శాతం స్లాబుల్లోకి మార్చుతూ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా రేస్ క్లబ్బులు, లీజింగ్/రెంటర్ సేవలు, క్యాసినో, జూదం, గుర్రం పందేలు, లాటరీ, ఆన్ లైన్ మనీ గేమింగ్ పై 40 శాతం పన్ను భారం మోపనున్నారు. ఈ స్లాబ్ లోకి ప్రీమియం క్రికెట్ సహా ఇతర స్పోర్టివ్ ఈవెంట్ల టికెట్ ధరలు సైతం చేరడంతో ఈ భారం ప్రేక్షకుడిపై పడబోతున్నది. ఇప్పటి వరకు ఐపీఎల్ టికెట్లు 28 శాతం పన్ను పరిధిలో ఉండగా ఇప్పుడు అదనంగా మరో 12 శాతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడబోతున్నది.

టికెట్ పై జీఎస్టీ భారం ఎలా ఉండబోతోంది?:

ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ టికెట్ ధర రూ. 1000 ఉందనుకుంటే దాని మీద 28 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. దాంతో టికెట్ ధర రూ.1280 చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మారిన జీఎస్టీ స్లాబ్ కారణంగా 40 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.1000 టికెట్ కు జీఎస్టీ కింద రూ.400 మొత్తం కలిపి రూ. 1400 చెల్లించాల్సి ఉంటుంది. క్రికెట్ ను ఓ రిలీజియన్ గా భావించే అభిమానులు ఈ జీఎస్టీ భారంతో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Next Story