- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
26 వేల టికెట్లు సేల్ : హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
by Harish |
భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్‌కు సంబంధించి 26 వేల టికెట్లు విక్రయించినట్టు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ వేదికగా ఈ నెల 25 నుంచి 29 వరకు జరిగే భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్‌కు సంబంధించి 26 వేల టికెట్లు విక్రయించినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి టెస్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. అధునాతన హంగులతో స్టేడియం తీర్చిదిద్దామన్నారు. ఈ మ్యాచ్‌కు రోజుకు ఐదు వేల మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామని, వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 23న పార్క్ హయత్ హోటల్‌లో బీసీసీఐ అవార్డ్స్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు వచ్చే ఇండియా టీమ్ పార్క్ హయత్ హోటల్, ఇంగ్లాండ్ టీమ్ తాజ్ డెక్కన్ హోటల్‌లో బస చేస్తారని తెలిపారు.
- Tags
- #ind vs eng
Next Story






