- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధోనీలా అవ్వాలనుకుంటున్నా.. మాహీపై పాక్ కెప్టెన్ ప్రశంసలు
భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ తనకు స్ఫూర్తి అని పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా తెలిపింది.

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ తనకు స్ఫూర్తి అని పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ధోనీపై ప్రశంసలు కురిపించింది. ధోనీలా అవ్వాలనుకుంటున్నట్టు చెప్పింది. ‘వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో కెప్టెన్‌గా ఉండటం టెన్షన్ పెడుతుంది. కానీ, నేను కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీని స్ఫూర్తిగా తీసుకుంటా. భారత, సీఎస్కే కెప్టెన్‌గా ధోనీ ఉన్నప్పటి మ్యాచ్‌లను నేను చూశాను. మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు, ప్రశాంతంగా ఉండటం, ప్లేయర్లకు మద్దతు ఇవ్వడం.. ఇలాంటి ఎన్నో విషయాలు ధోనీ నుంచి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నన్ను కెప్టెన్‌గా నియమించినప్పుడు ధోనీలా అవ్వాలని అనుకున్నా. ధోనీ ఇంటర్వ్యూలు చూశాను. అతని నుంచి చాలా నేర్చుకున్నా.’అని ఫాతిమా చెప్పుకొచ్చింది. ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. అందుకు ఒక్క సంవత్సరం ముందు అంటే 2019లో ఫాతిమా వన్డేల్లోకి అరంగేట్రం చేసింది. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే మహిళల వన్డే వరల్డ్ కప్‌లో పాక్ జట్టుకు ఫాతిమా నాయకత్వం వహిస్తుంది.






