టెస్టు జట్టుకు అతను అర్హుడు.. గంభీర్‌కు కీలక సూచన చేసిన గంగూలీ

by Harish |

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నాడు.

టెస్టు జట్టుకు అతను అర్హుడు.. గంభీర్‌కు కీలక సూచన చేసిన గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నాడు. అతనికి భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. షమీని తిరిగి టెస్టు జట్టులోకి తీసుకోవాలని హెడ్ కోచ్ గంభీర్‌కు సూచించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టు భారత్ పరాజయం తర్వాత దాదా.. జట్టులో షమీ ప్రాధాన్యతను నొక్కి చెప్పాడు. ‘షమీపై నమ్మకం ఉంచండి. టెస్టు జట్టులో చోటుకు అతను అర్హుడు. బుమ్రా, సిరాజ్, షమీ త్రయాన్ని గంభీర్ నమ్మాలి. షమీ, స్పిన్నర్లు టెస్టు మ్యాచ్‌లు గెలిపిస్తారు.’అని గంగూలీ తెలిపాడు. షమీ 2023 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. చాంపియన్స్ ట్రోఫీ, రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ సెలెక్టర్లు అతన్ని పక్కనపెడుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా గంభీర్‌కు గంగూలీ మరికొన్ని సూచనలు కూడా చేశాడు. భారత్‌లో గంభీర్ మంచి పిచ్‌లు ఎంచుకోవాలన్నాడు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలన్నాడు. భారత బ్యాటర్లు 350-400 రన్స్ చేస్తే తప్ప టెస్టు మ్యాచ్‌ను గెలవలేరని చెప్పాడు.


Next Story