రికార్డు బుక్స్‌లోకి హర్మన్‌ప్రీత్.. ఏకైక మహిళా క్రికెటర్‌గా ఘనత

by Harish |

రికార్డు బుక్స్‌లోకి హర్మన్‌ప్రీత్.. ఏకైక మహిళా క్రికెటర్‌గా ఘనత
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు బుక్స్‌లో తన పేరును లిఖించుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఘనత సాధించింది. ఆస్ట్రేలియాతో రెండో టీ20 ఆడటం ద్వారా ఆమె ఈ రికార్డు నెలకొల్పింది. భారత్‌ తరపున ఆమెకు ఇది 356వ అంతర్జాతీయ మ్యాచ్. న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్(355)‌ను వెనక్కినెట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెరరీ(349), భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్(333), ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్(309) ఉన్నారు. 2009‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన హర్మన్ ఇప్పటివరకు ఆరు టెస్టులు, 161 వన్డేలు, 189 టీ20‌లు ఆడింది.


Next Story