- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ (Womens World Cup 2025) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur) కెప్టెన్సీలో టీమిండియా ఈ అరుదైన ఘనత సాధించారు. ఎన్నో సంవత్సరాల టీమిండియా కలను ఆమె తీర్చారు. జట్టును కెప్టెన్ గా ముందుండి నడిపించారు. ఈ నేపథ్యంలోనే ఫైనల్ మ్యాచ్ లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. అయితే తొలిసారి టీమిండియాకు టైటిల్ అందించిన నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం 36 ఏళ్లు ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్.. రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల కల తీర్చిన ఆమె, రోహిత్ శర్మ తరహాలోనే రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ.. టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక అతని తరహాలోనే హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా రిటైర్మెంట్ త్వరలోనే ఇవ్వనున్నారని టాక్. ఇక ఆమె రిటైర్మెంట్ ప్రకటిస్తే, స్మృతి మందాన కెప్టెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.






