సిక్సర్‌తో గాయం.. కౌగిలింతతో ఉపశమనం.. మైదానంలో హార్దిక్ పాండ్యా ‘జెంటల్‌మెన్’ గెశ్చర్!

by Malleboina Mahesh |

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి ఐదో టీ20 జరిగింది. ఈ మ్యాచులో భారత జట్టు విజయం సాధించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది.

సిక్సర్‌తో గాయం.. కౌగిలింతతో ఉపశమనం.. మైదానంలో హార్దిక్ పాండ్యా ‘జెంటల్‌మెన్’ గెశ్చర్!
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి ఐదో టీ20 జరిగింది. ఈ మ్యాచులో భారత జట్టు విజయం సాధించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన ట్రేడ్‌మార్క్ పవర్ హిట్టింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతను బాదిన ఒక భారీ సిక్సర్ అనూహ్యంగా బౌండరీ లైన్ వద్ద విధుల్లో ఉన్న కెమెరామన్‌కు బలంగా తాకింది. బంతి వేగానికి కెమెరామన్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆట ఎంత ఉత్కంఠగా సాగుతున్నా, తోటి మనిషికి తగిలిన గాయం హార్దిక్ మనసును కలిచివేసింది. ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, హార్దిక్ నేరుగా ఆ కెమెరామన్ వద్దకు వెళ్ళాడు.

కెమెరామన్‌ను పరామర్శించడమే కాకుండా, అతడిని ఆప్యాయంగా కౌగిలించుకుని హార్దిక్ క్షమాపణలు కోరాడు. తన ఆరాధ్య క్రికెటర్ స్వయంగా వచ్చి పలకరించడంతో ఆ కెమెరామన్ ఆశ్చర్యం తో పాటు పట్టలేని ఆనందానికి లోనయ్యాడు. ఆ సమయంలో అతని ముఖంలో కనిపించిన ఆ 'ప్రైస్‌లెస్' రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో ఆటగాళ్లు చూపించే ఇలాంటి చిన్న చిన్న మానవీయ కోణాలు కేవలం మ్యాచ్‌లను మాత్రమే కాదు, అభిమానుల హృదయాలను కూడా గెలుచుకుంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Next Story