మరో కొత్త మోడల్‌తో హర్దిక్ పాండ్యా.. వీడియో వైరల్

by Malleboina Mahesh |   (  Updated:2025-10-10 08:34:36  IST  )

భారత స్టార్ ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా.. ఇటీవల నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు.

మరో కొత్త మోడల్‌తో హర్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా (Hardik Pandya).. ఇటీవల నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. తన మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌ (Natasha Stankovic)తో విడాకులు తీసుకున్న పాండ్యా.. కొద్ది రోజుల క్రితం వరకు ముంబైకి చెందిన మోడల్ జాస్మిన్ వాలియా (Model Jasmine Walia)తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వైరల్ అయిన వీడియో తో ఆ వార్తలకు చెక్ పడింది. హార్దిక్ పాండ్యా మరో మోడల్ మహికా శర్మ (Mahika Sharma)తో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించడం కొత్త ఊహాగానాలకు కారణమైంది. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, వారి మధ్య ఏదైనా ప్రత్యేక బంధం ఉన్నదా? అనే ప్రశ్న అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సంబంధంపై హార్దిక్, మహికా ఎవరూ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇది పూర్తిగా ఊహాగానాల స్థాయిలోనే కొనసాగుతోంది.

Next Story