- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియాకు గుడ్ న్యూస్.. పాండ్యా వచ్చేస్తున్నాడు
ఆసియా కప్‌లో గాయపడి జట్టుకు దూరమైన భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలోనే జాతీయ జట్టులోకి పునరాగమనం చేయనున్నారు.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో గాయపడి జట్టుకు దూరమైన భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలోనే జాతీయ జట్టులోకి పునరాగమనం చేయనున్నారు. గాయం నుంచి కోలుకున్న అతను ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో అతను ఆడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే, అంతకుముందు అతను ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అతను బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లో ట్రైనింగ్ అవుతున్నాడు. జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు పాండ్యా ఈ నెలలో జరగబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడబోతున్నట్టు సమాచారం. బరోడా తరపున తొలి మ్యాచ్ లేదా రెండో మ్యాచ్ ఆడనున్నాడు. అనంతరం తిరిగి భారత్ తరపున ఆడటానికి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అతనికి క్లియర్స్ ఇస్తుంది. ఆసియా కప్‌లో పాండ్యా ఎడమ తొడకు గాయమైంది. దీంతో పాకిస్తాన్‌తో ఫైనల్‌కు దూరమైన విషయం తెలిసిందే. అలాగే, ఇటీవల ఆస్ట్రేలియా టూరు కూడా మిస్ అయ్యాడు. ఈ నెల 30 నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.






