మాజీ భార్య నటాషా, కుమారుడికి రూ. 4 కోట్ల కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా!

by Ramesh Naini |

భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్, ఐదేళ్ల కుమారుడు అగస్త్యకు ఓ ఖరీదైన గిఫ్ట్‌ని ఇచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

మాజీ భార్య నటాషా, కుమారుడికి రూ. 4 కోట్ల కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్, ఐదేళ్ల కుమారుడు అగస్త్యకు ఓ ఖరీదైన గిఫ్ట్‌ని ఇచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. విడాకుల తర్వాత కూడా ఆదర్శవంతమైన 'కో-పేరెంటింగ్' విధానంతో వీరు అందరి మనసులు దోచుకున్నారు. తాజాగా, కుమారుడు అగస్త్య, మాజీ భార్య నటాషాలకు సుమారు రూ. 4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) ఎస్‌యూవీ కారును హార్దిక్ బహుమతిగా అందించాడు. ముంబైలోని నవ్‌నిత్ మోటార్స్ (Navnit Motors) షోరూమ్‌లో నటాషా, చిన్నారి అగస్త్య ఈ సరికొత్త బ్లాక్ కలర్ కారును డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సదరు కార్ల సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘హార్దిక్ పాండ్యా డిఫెండర్ కొనుగోలు కోసం మరోసారి నవ్‌నిత్ మోటార్స్‌ను ఎంచుకున్నారు. ఇది నమ్మకంతో నిర్మించుకున్న బంధం. అగస్త్య పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌లకు కారును అందజేశాం’ అని క్యాప్షన్‌లో పేర్కొంది. మోడల్, కస్టమైజేషన్‌ను బట్టి ఈ కారు ధర రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఆదర్శంగా కో-పేరెంటింగ్

2020లో ప్రేమ వివాహం చేసుకున్న హార్దిక్, నటాషా.. జులై 2024లో అధికారికంగా విడిపోయిన సంగతి తెలిసిందే. వైవాహిక బంధానికి స్వస్తి పలికినా, కుమారుడి పెంపకం విషయంలో మాత్రం ఇద్దరూ ఎంతో పరిణతితో, బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. విడాకుల తర్వాత హార్దిక్ తన వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగుతున్నప్పటికీ, తన కుమారుడే తన తొలి ప్రాధాన్యత అని ఈ గిఫ్ట్ ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు.

బాలీవుడ్ నటితో హార్దిక్ రిలేషన్‌!

కాగా, ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, నటాషా ఇద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో ముందుకు సాగుతున్నారు. బాలీవుడ్ నటి మహికా శర్మతో హార్దిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఇటీవలే ఆమె 25వ పుట్టినరోజు సందర్భంగా ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన హార్దిక్.. తమ బంధాన్ని అధికారికంగా ధృవీకరించాడు. ఇక, విడాకుల తర్వాత నటాషా తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తూ, తిరిగి కెరీర్‌తో బిజీ అవుతోంది.

Next Story