Harbhajan Singh : పంత్ బదులు శాంసన్‌ను ఆడించండి.. : హర్భజన్ సింగ్

by Sathputhe Rajesh |

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రిషభ్ పంత్ బదులు సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచించాడు.

Harbhajan Singh : పంత్ బదులు శాంసన్‌ను ఆడించండి.. : హర్భజన్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రిషభ్ పంత్ బదులు సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఈ మేరకు ఆదివారం ఓ యూట్యూబ్ ఛానెల్‌తో హర్భజన్ మాట్లాడాడు. ‘పంత్, శాంసన్‌లలో ఒకరిని సెలక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను శాంసన్‌నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అతడు సౌతాఫ్రికాతో వన్డేలు ఆడాడు. రిషభ్ పంత్ ఆస్ట్రేలియా అద్భుతంగా రాణించాడు. సుదీర్ఘంగా సిరీస్ ఆడిన పంత్‌కు విరామం ఇవ్వాలి. అదొ పెద్ద విషయం కాకపోవచ్చు. జడేజా విషయంలో నేను అక్షర్ పటేల్‌కే మద్దతు తెలిపాను. గత కొన్నేళ్లుగా జడేజా భర్తీ చేసిన స్థానాన్ని అక్షర్ ఫుల్ ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.’ అని హర్భజన్ సింగ్ అన్నాడు. శాంసన్ ఆడిన గత ఏడు టీ20ల్లో మూడు సెంచరీలు చేశాడు. సౌతాఫ్రికాతో ఆడిన చివరి వన్డేలో సైతం శాంసన్ సెంచరీ చేసి రాణించాడు. మరో వైపు అక్షర్ పటేల్ 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 92 పరుగులు చేశాడు. తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.

Next Story