రోహిత్ కెప్టెన్సీ ఊస్ట్.. షాక్‌కు గురయ్యానంటూ హర్భజన్ సింగ్ కామెంట్స్

by Harish |

టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి గిల్‌కు పగ్గాలు అప్పగించడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.

రోహిత్ కెప్టెన్సీ ఊస్ట్.. షాక్‌కు గురయ్యానంటూ హర్భజన్ సింగ్ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి గిల్‌కు పగ్గాలు అప్పగించడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. టెస్టు క్రికెట్‌లో గిల్ నాయకత్వాన్ని పొగిడిన హర్భజన్ వన్డే కెప్టెన్సీ ఇవ్వడాన్ని స్వాగతించాడు. ‘గిల్‌కు శుభాకాంక్షలు. టెస్టు జట్టును బాగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు వన్డే జట్టును నడిపించే అదనపు బాధ్యత కూడా తోడైంది. అతనికి ఇది కొత్త చాలెంజ్.’అని తెలిపాడు. అలాగే, రోహిత్‌ను తప్పించడం తనను షాక్‌కు గురిచేసిందన్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉందని చెప్పాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో రోహిత్ భారత క్రికెట్‌కు మూలస్తంభలాంటివాడని ప్రశంసించాడు. రోహిత్ కెప్టెన్‌గా లేకపోవడం తనను నిరాశపర్చిందన్నాడు. అతని అనుభవం, నాయకత్వ లక్షణాలు అమూల్యమైనవని చెప్పాడు.


Next Story