- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > Harbhajan Vs Dhoni: కప్ ఒక్కడి వల్ల రాలేదు... లస్సీ తాగడానికి వెళ్లామా? ధోనీపై హర్భజన్ సెన్సేషనల్ కామెంట్స్
Harbhajan Vs Dhoni: కప్ ఒక్కడి వల్ల రాలేదు... లస్సీ తాగడానికి వెళ్లామా? ధోనీపై హర్భజన్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ధోనీపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2

X
దిశ, వెబ్‌డెస్క్: ధోనీపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2011లో వన్డే వరల్డ్ కప్ క్రెడిట్ ధోనీకి ఇస్తుండటంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. వరల్డ్ కప్ రావడంలో అందరి కృషి ఉందని, ధోనీ ఒక్కడి వల్లే రాలేదని తెలిపాడు. ఒక్కడి వల్లే ఏది సాధ్యం కాదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ ఒక్కడి వల్లే వచ్చిందని మాట్లాడటం సరికాదని స్పష్టం చేశాడు.
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంకపై విజయంలో భారత జట్టులోని అందరి పాత్ర ఉందని హర్భజన్ తెలిపాడు. వరల్డ్ కప్ ఫైనల్‌లో గొప్పగా ఆడిన గంభీర్ ఏం చేసినట్లు..? మిగతా 10 మంది లస్సీ తాగడానికి వెళ్లారా? అని ప్రశ్నించాడు. క్రికెట్ అనేది టీమ్ గేమ్ అని, అందరూ బాగా ఆడితేనే జట్టు ముందుకు వెళుతుందని సూచించాడు.
Next Story






