- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాటూలు లేవని ఆ ప్లేయర్‌ను ఆడించడం లేదా..? : BCCIపై హర్భజన్ సింగ్ ఫైర్
టాటూలు లేవని కరుణ్ నాయర్‌ను బీసీసీఐ ఆడించడడం లేదా..? అని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు.

దిశ, స్పోర్ట్స్ : టాటూలు లేవని కరుణ్ నాయర్‌ను బీసీసీఐ ఆడించడం లేదా..? అని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. బుధవారం ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడాడు. ‘2024-25లో నేను అతని గణాంకాలు చూశాను. ఆరు ఇన్సింగ్స్‌ల్లో 664 పరుగులు చేశాడు. 120 అతని స్ట్రయిక్ రేట్. అయినా అతన్ని ఎంపిక చేయకపోవడం సరికాదు. రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటిన వారికి జట్టులో చోటు కల్పిస్తున్నారు. ఐపీఎల్‌లో ఆటతీరును బట్టి అవకాశం ఇస్తున్నారు. రోహిత్, విరాట్‌లు ఫామ్‌లో లేరని రంజీల్లో ఆడిస్తున్నారు. రంజీల్లో పరుగులు చేస్తున్న ఆటగాళ్లకు ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ప్రతిభ ఉన్న ఈ ఆటగాళ్లు భారత్ తరఫున ఎప్పుడు ఆడతారు. ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా నాయర్‌ను తప్పించారు. దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇంగ్లాండ్‌కు నాయర్ వెళ్లాడు. కానీ ఐదో టెస్ట్‌కు ఆటగాడిని భారత్ నుంచి రప్పించి మరి ఆడించారు. అతను హనుమ విహారీ అనుకుంటా. నాయర్ స్థానంలో అతడిని ఆడించారు. ఒక్కో ఆటగాడికి ఒక్కో రూల్ ఉంటుందా..పరుగులు చేస్తున్న ఆటగాడిని ఆడించాలి. టాటూలు లేవని, ఫ్యాన్సీ డ్రెస్సులు వేయడం లేదని నాయర్‌ను జట్టులోకి తీసుకోవడం లేదా..? అతడు జట్టులోకి రావడానికి శ్రమించడం లేదా..?’ అని హర్భజన్ ప్రశ్నించాడు.






