గుర్నూర్ సెంచరీ మిస్..10 ఓవర్లలో 97 రన్స్

by velandi.Saikiran |

చివరి వన్డే నేపథ్యంలో భారత యంగ్ బౌలర్ గుర్నూర్ బ్రార్ చెత్త ప్రదర్శన కనబరిచాడు.

గుర్నూర్ సెంచరీ మిస్..10 ఓవర్లలో 97 రన్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న చివరి వన్డే నేపథ్యంలో భారత యంగ్ బౌలర్ గుర్నూర్ బ్రార్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ లో 10 ఓవర్లు సంధించిన గుర్నూర్ బ్రార్, ఏకంగా 97 పరుగులు ఇచ్చి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇన్ని పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మనోడిని లెఫ్ట్, రైట్ ఇంగ్లాండ్ బ్యాటర్లు వాయించేశారు. ఈ క్రమంలో వన్డేలలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మూడో భారత బౌలర్ గా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు గుర్నూర్ బ్రార్.

2017లో దక్షిణాఫ్రికాపై భువనేశ్వర్ ఏకంగా 106 పరుగులు ఇచ్చాడు. 2013లో వినయ్ కుమార్ ఆస్ట్రేలియా పై 102 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇద్దరి తర్వాత ఇప్పుడు గుర్నూర్ బ్రార్ నిలిచాడు. దీంతో అనవసరంగా గుర్నూర్ బ్రార్ ను తుది జట్టులోకి తీసుకున్నారని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు క్రికెట్ అభిమానులు. కాగా ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 387 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆచితూచి ఆడుతోంది.

Next Story